సెల్ఫీ తీసుకొంటుండగా మంత్రిగారిని నిలువునా దోచేసిన దొంగలు!

వాస్తవం ప్రతినిధి: ఎంకిపెళ్లి సుబ్బి చావు కొచ్చినట్టు పెళ్లికి వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగుతున్న మంత్రికి ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహా వేడుకలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. షేక్ హ్యాండ్‌లు కూడా పోటీ పడి ఇచ్చారు. అభిమానులతో ఫోటోలు దిగే సమయంలో ఆయన చేతికున్న కడియం ఎవరో దొంగిలించారు. గందరగోళం అంతా ముగిశాక తన చేయి చూసుకుంటే బంగారు కడియం మాయమయ్యింది. ఈ బంగారు కడియం మంత్రికి సెంటిమెంట్ అన్నది ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.దీంతో అక్కడే ఉన్న పోలీసులను గన్ మెన్ లపై మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ఏం చేస్తారో నాకు తెలియదు ఆ కడియం తిరిగి తీసుకు రావాల్సింది అంటూ ఆజ్ఞలు జారీ చేశారు. ఏం జరుగుతుందో గ్రహించలేని పోలీసులు బిత్తరపోయి అక్కడ ఉన్న వారికి ఎవరికైనా కడియం దొరికితే తెచ్చి ఇవ్వాలంటూ అడగటం మొదలు పెట్టారు. కడియం కొట్టేసిన వారిని ఎవరిని ఏమనమని , తిరిగి ఇచ్చేయండి బాబూ అంటూ బతిమాలడం మొదలు పెట్టారు.