ఉగాదికి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్..!!

వాస్తవం సినిమా: ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ సినిమా చేయడం జరిగింది. ‘బాహుబలి’ తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని ‘సాహో’ సినిమా కి భారీగా ఖర్చు పెట్టి దాదాపు రెండు సంవత్సరాలపాటు షూటింగ్ చేయడం జరిగింది. తీరా సినిమా విడుదలయ్యాక మొదటి షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో తీవ్ర నిరుత్సాహానికి ప్రభాస్ మరియు ఆయన అభిమానులు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదిరిపోయే లవ్ స్టోరీ అని ప్రభాస్ కెరీర్ లోనే ఇటువంటి స్టోరీ ఎప్పుడు చేయలేదని..కుదిరితే ఈ సంవత్సరం చివరన సినిమా విడుదలవుతుందని లేకపోతే వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేశారు కృష్ణంరాజు. అంతే కాకుండా అంతా కుదిరితే ఉగాది పండుగనాడు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.