పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!!

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలోకి పెళ్లి చూపులు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ లు అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం లాంటి సక్సెస్ లు అందుకున్నాడు. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలం నుండి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో..చాలా టైం తీసుకుని క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేయడం జరిగింది. నలుగురు హీరోయిన్లతో మొట్టమొదటిసారి విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీఖున విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం కెరీర్ ని ప్రేమిస్తున్నానని…పెళ్లి అంటే తనకు ఎంతో గౌరవం ఉంది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ గా లేను అని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఇంకెన్నో విజయాలు జీవితంలో సాధించాలని అప్పటి వరకు పెళ్లి అనే టాపిక్ గురించి ఆలోచించను అని విజయ్ చెప్పుకొచ్చాడు.