బాలకృష్ణ కొడుకు ఎంట్రీ కన్ఫర్మ్..??

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల కొడుకులు అందరూ ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ హీరోలు గా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నందమూరి అభిమానులు బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నా ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆ సందర్భంలో నందమూరి మోక్షజ్ఞ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని వ్యాపారాలు చేయాలని ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే తరుణంలో కొన్ని రోజుల తర్వాత మోక్షజ్ఞ భయంకరమైన లావు కలిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లోకి రావడంతో అది చూసిన నందమూరి అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ ఫోటో చూసి కన్ఫామ్ మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి రాడు అని డిసైడ్ అయ్యారు. ఇటువంటి తరుణంలో బాలయ్యబాబు తన అభిమానులకు అదిరిపోయే హోప్ ఇచ్చారు. త్వరలోనే తనయుడ్ని అమెరికా పంపాలని..నటసింహం నిర్ణయం తీసుకున్నారట. న్యూయార్క్‌లోని లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ చేసేందుకు మోక్షజ్ఞ కూడా ఒప్పుకున్నాడట. దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హైలెట్ వార్తగా నిలిచింది.