స్టార్ నిర్మాత దిల్ రాజు పెళ్లి..??

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు మరొకసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ నుండి వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ అభిమానులను టార్గెట్ చేస్తూ దిల్ రాజు అనేక సినిమాలను నిర్మించడం జరిగింది. అయితే ఇటీవల దిల్ రాజు మాస్ సినిమాలు కూడా నిర్మిస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త రావడంతో ఇండస్ట్రీలో ఈ టాపిక్ హైలెట్ వార్తగా నిలిచింది. దిల్ రాజు మొదటి భార్య 2 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అదే సమయంలో దిల్ రాజు కూతురు కూడా ఉండటం ఆమెకు పెళ్లి కూడా అవడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దిల్ రాజుకి సొంత కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో దిల్ రాజు చేసేదేమీలేక రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా చేసుకోబోయే అమ్మాయికి ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదని సమాచారం.