మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది..అడ్రెస్ లేకుండా పోతావ్..!!

వాస్తవం ప్రతినిధి: అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌న్న డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం మొదలై 54 రోజులు దాటింది. వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు ఇంకా కొన‌సాగుతునే ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కోస‌ం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఇదివరకు వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా తుళ్లూరు మండ‌ల కేంద్రంతో పాటుగా వెల‌గ‌పూడి, మంద‌డం గ్రామాల్లో నిర‌స‌న‌లు జోరుగా జరుగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తదితర నాయకులు కూడా వీటిలో భాగమయ్యారు. ప్ర‌భుత్వం నుంచి పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త వ‌చ్చి, త‌మ డిమాండ్ నెర‌వేర్చే వ‌ర‌కూ ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని అమరావతి రైతులు తేల్చి చెప్తున్నారు. ఆందోళ‌న సాగిస్తున్న‌ మ‌హిళ‌ల ప‌ట్ల పోలీసులు విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ అమరావతి మహిళలు వాపోతున్నారు. జగన్ మమ్మల్ని నమ్మించి గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గడప తొక్కి అడుక్కుంటే ఓట్లు వేశామని, కాని ఇప్పుడు నువ్వు మమ్మల్ని నిలువునా ముంచేశావని జగన్ పై మండిపడుతున్నారు. మేం నీకు ఏమి అన్యాయం చేశాం అని నువ్వు మమ్మల్ని ఈ విధంగా బాధపెడుతున్నావు , ఒక్క ఛాన్స్ ఇస్తే మా కొంప నిలువునా ముంచేశావని, నీకు పుట్టగతులు లేకుండాపోతావు అని జగన్ కు శాపనార్ధాలు పెడుతున్నారు. నువ్వు నీ పద్దతి మార్చుకుని రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే సరే లేదంటే.. నీ తండ్రికి పట్టిన గతే నీకు పడుతుందని, శవం కూడా దొరకని విధంగా అడ్రెస్ లేకుండా పోతావు అని తమ ఆవేదన మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.