మరో బాంబ్ పేల్చిన జగన్ సర్కార్.. ఏపీ ప్రజలకు షాక్ .!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు షాకిచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెంచేసింది. జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలతో భుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే భారం పడనుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి. ఇక నుంచి సబ్సిడీదారులకు బిల్లు వెనుక సబ్సిడీ వివరాలు పొందుపరుస్తామని తెలిపారు ఏపీ ఈఆర్సీ చైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి. గత కొంత కాలంగా ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచుతారు అనే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ప్రభావం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై భారీగా పడుతుంది. విద్యుత్ కోతలతో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడిన చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడే ఆ నష్టాల నుంచి బైటపడుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై మరోసారి పెను భారంగా మారనుంది. దీంతో ప్రజలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చినట్లయ్యింది.