అమెరికా సెనేట్ బరిలో తెలుగు మహిళ

వాస్తవం ప్రతినిధి: వర్జినియా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన మంగ అనంతమూల ప్రకటించారు. ప్రతినిధుల సభకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా మంగా అనంతాత్ముల నిలిచారు. ఈమె ఇటీవలే హెర్న్‌డన్‌ నుంచి తన ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. డెమొక్రాట్లకు కంచుకోటగా పరిగణించే 11వ కాంగ్రెషనల్ జిల్లాలో ఎక్కువగా వాషింగ్టన్ డీసీ శివార్లలోని సంపన్న ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలో ఉంది.ఇక్కడ సుమారు 17 శాతం ఆసియా జనాభా ఉండగా… 7 శాతం భారతీయ అమెరికన్లు ఉన్నారు.భారతీయ అమెరికన్లతో సహా ఆసియా అమెరికన్లు మొదటి నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధులకు మద్ధతు ఇస్తున్నారు.

నవంబర్‌లో కాంగ్రెషనల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు జెర్రీ కొన్నోలీనితో ఆమె పోటీ పడనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయవంతమైన నిర్ణయాల వల్ల పెద్ద సంఖ్యలో డెమొక్రాటిక్‌ కార్యకర్తలు, నాయకులు.. రిపబ్లికన్‌ పార్టీ వైపు వస్తున్నారని మంగ పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైతే యూఎస్‌-భారత్‌ మధ్య సంబంధాల బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని మంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ.. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించంచారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం భర్త ఉన్నత చదువుల నిమిత్తం కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు.