‘జాను’ రివ్యూ :-

రేటింగ్: 3/5

నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్..తదితరులు
డైరెక్టర్: సి ప్రేమ్ కుమార్
ప్రొడ్యూసర్: దిల్ రాజు
మ్యూజిక్: గోవింద్ వసంత
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 7, 2020

పరిచయం:

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళ డైరెక్టరే ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ‘జాను’ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా తమిళ సినిమాకి మ్యూజిక్ అందించిన గోవింద వసంత..తెలుగుకు కూడా మ్యూజిక్ సమకూర్చారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయింది.

కథ:

అతి చిన్న వయసులోనే స్కూల్లో చదువుతున్న సమయంలోనే కె. రామచంద్ర (శర్వానంద్ ) జాను (సమంత) ప్రేమలో పడతాడు. అయితే చదువు నిమిత్తం స్కూల్ నుండి ఇద్దరు విడిపోవడం జరిగింది. ఎవరికి వారు వేరే చోట ఉంటారు. కానీ స్కూల్ వయసులో పుట్టిన ప్రేమ ఇద్దరి మధ్య వయస్సుతోపాటు ప్రేమ కూడా పెరగటం జరుగుతుంది. దీంతో శర్వానంద్ తన ప్రేమని ఎలా గెలుచుకుంటాడు సమంతా ని ఎలా కలుసుకుంటాడు…అన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలిసిన తర్వాత అసలేం జరుగుతోంది ఇంతకీ వారిద్దరి మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుంది అనేది సినిమా స్టోరీ. చాలా రొటీన్ స్టోరీ అనిపించినా గాని సినిమాలో మంచి సోల్ ఉండటంతో..సినిమా స్టార్టింగ్ నుండి చివరి దాకా ప్రేక్షకులను స్కూల్ వయసులోకి తీసుకెళ్లే విధంగా డైరెక్షన్ చేశాడు ప్రేమ్ కుమార్.

విశ్లేషణ:

స్కూల్ చదివిన అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండటంతో సినిమా స్టార్టింగ్ నుండి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా స్టార్టింగ్ లో చాలా స్లోగా ఉంటుంది. కానీ మరో పక్క అదే మంచి ఫీల్ ఉంటుంది. దీంతో అదే తరహాలో తమిళంలోనూ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్…తెలుగులో కూడా అటువంటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ‘జాను’ సినిమాని సూపర్ గా తెరకెక్కించాడు. లవ్ స్టోరీ ఇష్టపడే మరియు క్లాసిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉన్నాగాని ప్రేక్షకులను స్టోరీ లోకి ఒక అద్భుతమైన ఫీల్ లోకి తీసుకెళ్తాడు డైరెక్టర్. ముఖ్యంగా సినిమాలో స్కూల్ టైం లో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్…తమిళంలో నటించిన స్కూల్ ఎపిసోడ్ నటీనటులే తెలుగులో కూడా నటించడం జరిగింది. స్కూల్ టైం లో వచ్చే హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను బాగా చేశారు ఆ నటీనటులు. స్కూల్ టైం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయింది. ఇదే తరుణంలో శర్వానంద్ మరియు సమంతా లు కూడా కథలో జీవించారు. ఇద్దరికిద్దరూ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి స్టోరీ ని ప్రేక్షకుడు కనెక్ట్ చేయడంలో వెండితెరపై సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఓవరాల్ గా:

తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా…తెలుగులో కూడా అదే రెస్పాన్స్ దక్కించుకునే విధంగా సినిమా చిత్రీకరించాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిష మాదిరిగానే శర్వానంద్ – సమంత తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా నటించడం జరిగింది. చాలా స్లోగా ఉన్నా గాని సినిమా చాలా వరకు ప్రేక్షకులను అలరించే విధంగా డైరెక్ట్ చేశాడు ప్రేమ్ కుమార్. మొత్తం మీద ‘జాను’ సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేక యావరేజ్ గా నడుస్తుందా అనేది ప్రేక్షకులు డిసైడ్ చెయ్యాలి. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా వేదన – ప్రేమ ల మిళితం గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి స్టోరీ ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. ఎక్కువగా యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమా ఉంది. సినిమా రిలీజ్ కాకముందే 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసింది.
                                                                                                           … పాంచజన్య