మళ్లీ అదే తప్పు చేస్తే కుదరదు జగన్ కి తేల్చి చెప్పిన ఉండవల్లి..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రంలో మూడు రాజధానులు గురించి జరుగుతున్న వివాదాలపై స్పందిస్తూ దేశంలోనే ఇటువంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదని 3 రాజధాని గురించి తనకు అంత ఐడియా లేదని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ విశాఖపట్టణానికి హైదరాబాదు మరియు బెంగళూరు తరహా స్టేటస్ తీసుకొస్తానని ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పటం దారుణమని తెలిపారు. గతంలో ఈ విధంగానే తప్పు చేశారని, హైదరాబాద్ అభివృద్ధి చేసి ఏపీ భవిష్యత్తు నాశనం చేశారని మళ్లీ అదే తప్పు చేస్తే కుదరదని జగన్ కి తేల్చిచెప్పారు ఉండవల్లి. ఒకచోట అభివృద్ధి కాకుండా డీ సెంట్రలైజ్ చేయాలని జగన్ కి సూచించారు. రాజధానుల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం మరియు ప్రత్యేక హోదా పై దృష్టి సారించాలని ప్రభుత్వానికి తెలిపారు.