పవన్ సంచలన ప్రకటన..ఇక జగన్ చాప్టర్ క్లోజ్..??

వాస్తవం ప్రతినిధి: ఏపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీకి కొన్నాళ్ల పాటు రాజకీయంగా తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ ఆరు నెలలు తిరగక ముందే ఏపీలో రాజకీయాలు మళ్లీ హాట్ హాట్‌గా మారిపోయాయి. మూడు రాజధానుల విషయం కారణంగా విపక్షాలకు వైసీపీ టార్గెట్ అవుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సరే..అధికారం ముఖ్యం కాదు ప్రజల సేవే మాకు ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన మూడు రాజధానుల అంశంపై కంటి మీద కునుకు లేకుండా నిరంతరం శ్రమిస్తుంది. ఏపీ రాజధానిగా విశాఖపట్నం నగరాన్ని రూపుదిద్దాలని వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర జనసేన నేతలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జనసేన నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలను చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా విశాఖ సమీపంలోని 10 మండలాల్లో ప్రభుత్వం భూసమీకరణ చేస్తోందని పవన్‌కు ఉత్తరాంధ్ర నేతలు ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములు లాక్కొని పేదలకు అన్యాయం చేయాలనే చూస్తోందని పవన్‌కు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేయాలనీ ఆలోచనలో ఉందని, వైసీపీ నేతలందరూ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు పవన్ కి విన్నవించుకున్నారు.

దీనిపై పవన్ స్పందిస్తూ.. ఇప్పటికే అమరావతి ప్రాంతానికి చెందిన రైతులను రోడ్డుమీద పడేశారని, ఇంకా ఎంత మంది జీవితాలను వైసీపీ నేతలు నాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసమీకరణ కోసం గ్రామసభలు నిర్వహిస్తున్న తీరును జనసేన నాయకులు నిశితంగా గమనిస్తుండాలని తెలిపారు. విశాఖలో పేద రైతులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అలాంటి హామీలనే అమరావతిలో ఎలా ఉల్లంఘించారు అనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఈ భూసమీకరణ ముసుగులో ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయో గుర్తించాలని పవన్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల దుస్థితి ఉత్తరాంధ్ర రైతులకు రాకుండా చూడాలని నిర్దేశించారు. అంతేకాకుండా ఇప్పటికే భూసమీకరణాల పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, వారి జీవితాలు కూడా ఎక్కడ నాశనం అవుతుందో అనే భయం ఉత్తరాంధ్ర రైతుల్లో కూడా మొదలైందని, వారందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది తెలుసుకున్న వైసీపి నేతలు పవన్ ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత బాగా ప్రజలను చూసుకుంటున్నారు, మరి అధికారంలో ఉంటే ఇంకా ఎన్నొ సేవలు, మంచి పనులు, అభివృధి కార్యక్రమాలు చేస్తాడు అనుకుంటున్నారని ఏపి రాజకీయాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ కన్నా పవన్ నే బెటర్ అని, జగన్ నమ్మించి గొంతు కోస్తే..పవన్ అధికారంలో లేకపోయినా ప్రజల కోసం అడ్డమైన వాళ్ల దగ్గర మాటలు పడుతున్నారని, అందుకే పవన్ అంటే అంత మంది జనం ఇష్టపడుతారని..పవన్ కోసం నిరంతరం శ్రమిస్తారని తెలుగు రాష్ట్రాల్లలో వినిపిస్తున్న మాట. ఈ మాటలు కాని జగన్ వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అని, జగన్ చాప్టర్ క్లోజ్ అని సోషల్ మీడియాలో హాట్ టాక్ వినబడుతుంది.