నాగబాబుపై ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిన ఆటో రాంప్రసాద్..??

వాస్తవం సినిమా: తెలుగు టెలివిజన్ రంగంలో రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధిస్తూ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాలామంది కంటెస్టెంట్ లు సెలబ్రిటీలు గా మారిపోయి ప్రస్తుతం ఇండస్ట్రీలో అదిరిపోయే చాన్సులు అందుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేసిన మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో పై అందులో ఉన్న కంటెస్టెంట్స్ పై మరియు అదే విధంగా యాజమాన్యంపై కామెంట్లు చేయడం జరిగింది. ఇదే తరుణంలో వేరే ఛానల్ జబర్దస్త్ మాదిరిగానే అదిరింది అని షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు..తాజాగా ఆ షో ద్వారా జబర్దస్త్ షో పై మరియు అదే విధంగా..రోజా పై కూడా కామెంట్లు చేయడంతో ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో చాలామంది జబర్దస్త్ షోలో నుండి కొంతమంది నాగబాబు దగ్గరికి వెళ్లిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీమ్ సభ్యులు నాగబాబు షో కి వెళ్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. దీంతో ఈ విషయంపై జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ‘త్రీమంకీస్’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కు పోటీగా చాలా షోలు వస్తున్నాయి.. జబర్దస్త్ ని వదిలేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా ఆటో ప్రసాద్ స్పందించాడు. జబర్దస్త్ షోతో వచ్చే గుర్తింపు మరే ఇతర షో చేసినా రాదు. జబర్దస్త్ ఓ మ్యాజిక్. కొత్తగా వస్తున్న షోలు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలంటే కష్టం. అందుకే నేను ఇతర షోలకు వెళ్ళలేదు. నాతో పాటు సుడిగాలి సుధీర్.. గెటప్ శ్రీను కూడా ఈ షోని విడిచిపెట్టరు అని ఆటో రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆటో రాంప్రసాద్ ఇన్ డైరెక్ట్ గా నాగబాబుకి తన వ్యాఖ్యలతో షాక్ ఇచ్చారని అంటున్నారు ఫిలింనగర్ కి చెందిన వారు.