రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ మల్టీస్టారర్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి మొట్టమొదటిసారి నటిస్తున్న ఈ సినిమా సౌత్ ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం తో దేశ స్థాయి లో మరియు అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని మెగా మరియు నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ జరుగుతుండగానే రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈసారి కొత్తగా ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది.. అయితే ఈ తాజా చిత్రానికి సంబంధించి విషయాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.