రోజా నోటికి ఇక తాళం..? ఆమెను కావాలనే దూరం పెట్టేసిన జగన్..??

వాస్తవం ప్రతినిధి: ఒక్కప్పుడు హీరోయిన్ గా చేసి.. ప్రస్తుతం సినిమాలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. బుల్లితెరపై కూడా చేస్తోంది నటి రోజా. రోజా.. అంటే ఒక్కప్పుడు వెండితెరపై .. ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలకు నిద్రలేకుండా చేసిన రోజా గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయ రంగు పూసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయల్లోకి అడుగుపెట్టిన తరువాత ఆమె జీవితం పై ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఆమెను ఐరన్ లెగ్ గానే గుర్తించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పది సంవత్సరాలు తిరిగిన విషయం తెలిసిందే. రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం.. చంద్రబాబుకు అధికారం దూరమైందని టీడీపీ నేతలు అప్పట్లో గుసగుసలాడుకున్నారు. రోజా ముళ్లు (లెగ్ ) వలనే టిడిపి అధికారంలోకి రాలేదని విమర్శలు ఆ పార్టీ మహిళా నేతల నుండి రావడంతో.. రోజా టిడిపి నుండి స్థానభ్రంశం చెందింది. అప్పుడు అధికారంలో.. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని కలిసి రోజా తన మనసులోని మాట బయట పెట్టింది. ఆయన రోజా కు గ్రీన్ కార్పెట్ పరచటానికి సిద్దమే అని ఆమెకు అభయ‘హస్తం’ ఇవ్వటం జరిగింది. దీంతో టీడీపీ నాయకులు రోజా శని పోయిందని అనుకున్నారు. రోజా అడుగుపెట్టిన అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలిలో కలిసిపోయి.. ‘రోజా’ పువ్వులు చల్లించుకున్నారు. ఆ సమయంలో రోజా పడిన బాధ అంత ఇంత కాదు. అయ్యో అక్కున చేర్చుకున్న పెద్దాయన కు ఇలా జరిగిందని రోజా కన్నీరు మున్నీరుగా ఎడ్చిన విషయం తెలుసుకున్న .. ఆయన కొడుకు వైఎస్ జగన్ ఓదార్చటం జరిగింది.

ప్రతిపక్షములో ఉన్నప్పుడే అధికారపక్షానికి చెమటలు పట్టించిన రోజా, ఇప్పుడు అధికార పక్షంలో ఉంది. ఒక్కప్పుడు అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ కూడా దొరకని పరిస్థితులో ఉన్న రోజా, నేడు అదే అసెంబ్లీలో నిప్పులు కక్కుతూ ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడుతుంది. రోజా గారు మైక్ తీసుకుంటే ఆమె నోటి నుండి వచ్చే మాటలు కోసం అందరూ ఎదురుచూస్తారు. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రోజా సమయం వచ్చినప్పుడు తన రాజకీయ ప్రత్యుర్థులను ఏకిపారేస్తుంది. ఆమె నోటి నుండి వచ్చే బుల్లెట్లు లాంటి మాటలను తట్టుకొని నిలబడటం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు అందరిలో కూడా అద్భుతమైన వాక్చాతుర్యం మరియు ప్రస్తుత రాజకీయాల పట్ల అద్భుతమైన అవగాహన ఉన్నవారిలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అందరి కంటే కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ రోజా ఇప్పుడు మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే వెన్నుపోటు పొడుస్తున్నారని బయటకొచ్చిన ఆడియో టేప్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే. వైఎస్ ఆర్ సి పి పార్టీకు చెందిన కార్యకర్తలే తనకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని దీనిపై చర్యలు తప్పకుండా తీసుకోవాలని జగన్ కు రోజా మొరపెట్టుకుంది. మొదట తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పిన ఏపి సి ఎం జగన్ మోహన్ రెడ్డీ గారు, మెల్లగా దానిని అసలు పట్టించుకోవడమే మానేశారు అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. రోజాను జగన్ కావాలనే పక్కన పెట్టేశాడు అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. మరి దీని పై రోజా ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో, ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.