అమెరికాలో భారత విద్యార్థిని అనుమానాస్పద మృతి!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఈ నెల 21వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఆమె శుక్రవారం యూనివర్సిటీ ఆఫ్ నొట్రే డేమ్ క్యాంపస్ సమీపంలోని లేక్‌ వద్ద శవమై తేలింది. అయితే గత మంగళవారం నుంచి ఆమె ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు నొట్రే డేమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్రోస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నోట్రే డేమ్ పబ్లిక్ సేఫ్టీ సిబ్బంది శుక్రవారం క్యాంపస్‌లోని సరస్సులో జెర్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే, అన్రోస్‌ను ఎవరైనా చంపేసి లేక్‌లో పడేసి ఉంటారా? లేక ఆమెనే ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిందా? అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత దంత వైద్యం కోర్సు చదవాలని ఆమె ఆశించినట్లు అధికారులు తెలిపారు.