రోజర్‌ ఫెదరర్‌ కు తప్పిన పరాభవం

వాస్తవం ప్రతినిధి: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అతి కష్టమ్మీద ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 2-6, 2-6, 7-6(10/8), 6-3తేడాతో వందో ర్యాంకు ఆటగాడు టెన్నిస్‌ సాండ్‌గ్రెన్‌(అమెరికా)పై మూడున్నర గంటలు పోరాడి గెలిచాడు. ఫెదరర్‌ తొలి సెట్‌ను సునాయాసంగానే చేజిక్కించుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో సాండ్‌గ్రెన్‌ 27ఏస్‌లు, 73విన్నర్లతో సత్తాచాటగా.. ఫెదరర్‌ ఐదు ఏస్‌లు, 44విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. నేను ఈ రోజు చాలా అదృష్టవంతుడిని. నాకు అద్భుతాలపై నమ్మకముంది. ఈసారి సెమీస్‌కు వెళ్లేందుకు నేను పూర్తి అర్హుడిని కాను. కానీ చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఫెదరర్‌ తెలిపాడు.