పాకిస్థాన్‌లో మ్యాచ్‌ ఆడే ప్రసక్తే లేదు: బీసీసీఐ

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌లో తమ దేశం పర్యటించి, అక్కడ మ్యాచ్‌లాడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా స్పష్టం చేసింది. ఈ ఏడాది పాకిస్థాన్‌లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో భద్రతతోపాటు ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఆసియాకప్‌లో ఇండియా ఆడబోదని బోర్డు వర్డాలు తెలిపాయి. మరోవైపు ఆసియాకప్‌లో భారత్ పాల్గొనాలని పాక్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తోంది. ఆసియాకప్‌లో భారత్ ఆడకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమ దేశం పాల్గొనబోదని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికలకు దిగింది. అయితే ఆసియాకప్‌ను తటస్థ వేదికల్లో నిర్వహిస్తే అందులో పాల్గొంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మాత్రం టోర్నీని నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోమని వ్యాఖ్యానించింది.