ఫిబ్రవరి ఫస్ట్ నుండి ఏపీలో డోర్ డెలివరీ జగన్ సంచలన నిర్ణయం..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో కొత్త పెన్షన్ అమలు లోకి వస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ డోర్ డెలివరీ చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను రెడీ చేయాలని తాను చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామాలకు వెళ్లినప్పుడు అర్హుల జాబితాను ఖచ్చితంగా తనిఖీ చేస్తానని అర్హులైన వారికి స్థలం కేటాయించాలని ఎవరైనా కేటాయించలేదని నా దృష్టికి తీసుకువస్తే ఉపేక్షించేది లేదని చాలా సీరియస్ గా అధికారులకు జగన్ తెలిపారు. అంతేకాకుండా  ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ చేయాలి. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలి. కాబట్టి ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించాలి. మార్చి15 కల్లా లాటరీలు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ కోరారు.