శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ : లోకేష్.

వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి నారా లోకేష్ వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ బాబాయ్ వై ఎస్ వివేకా హత్య వెనుక కుట్ర ఉందని ….జగన్ ని సీఎం చేయడం కోసమే వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ వివేకా హత్య అని జగన్ తన రాజకీయ లబ్దికోసం వాడుకున్నారని శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైయస్ జగన్ అని ఇది అర్థమైంది కాబట్టే వాస్తవాలు తెలుసుకుని తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగించాలని జగన్ గారి చెల్లె హైకోర్టులో పిటిషన్ వేసే పరిస్థితి వచ్చిందని సీఎం కుర్చీ కోసం జగన్ అప్పట్లో చంద్రబాబు పై అనేక విమర్శలు చేశారని ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేయించారని ఆ కేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ దొంగ ఏడుపు ఏడవటం జరిగిందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కేసును తప్పుదారి పట్టించేందుకు జగన్ ప్రయత్నించాలని చూశారని లోకేష్ అన్నారు. అందువల్లే జగన్ చెల్లెలు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని న్యాయ పోరాటం చేస్తుందని ఆమెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.