ఆందోళకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో అక్కడ పార్టీనేతల ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో అక్కడ పరిస్థితి మరింత వేడెక్కింది. ఢిల్లీ లోని షాహిన్ బాగ్ ధర్నా కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులు ఢిల్లీ ప్రజల నివాసాల్లోకి చొరబడి రేప్‌ చేసి చంపేస్తారంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం ఒక ఇంటర్యూలో మాట్లాడిన ఆయన సీఏఏ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు షాహీన్‌బాగ్‌ వద్దకు లక్షలాది మంది ఆందోళనకారులు చేరుకుంటున్నారు. షహీన్‌బాగ్‌ లో గుమికూడుతున్న లక్షల మంది ఆందోళనకారులను చూసి ఢిల్లీ ప్రజలు గమనించి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని అన్నారు. ” ఆందోళనకారులు మీ ఇళ్లలోకి చొరబడతారు.. మీ అక్కలు, కూతుళ్లపై అత్యాచారాలు జరుపుతారు.. చంపేస్తారు.. అప్పుడు మిమ్మల్ని కాపాడేందుకు మోడీ అమిత్‌ షాలు రారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ” అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 11 న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గంటలో షాహీన్‌బాగ్‌ను క్లియర్‌ చేస్తామంటూ వర్మ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే తన నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులన్నింటిని కూడా నెల రోజుల్లో కూల్చేస్తామని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.