శాసనమండలిని రద్దు చేయడం పై వైసిపి పై సీరియస్ అయిన పవన్..!!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాసనమండలిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం పై సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లో కౌన్సిల్ రద్దు ఆమోదం జరిగిన తర్వాత స్పందించిన పవన్ కళ్యాణ్…వైయస్సార్ హయాంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు జగన్ రద్దు చేయటానికి తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీలో బిల్లులో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడానికి శాసనమండలి ఉందని, అందులో పెద్దలు ఉంటారని అటువంటి పెద్దల సభను రద్దు చేయడం రాజ్యాంగానికి విరుద్ధంగా అని ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను రద్దు చేయడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లేనని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.