పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్న ఐర్లాండ్ ఎన్నారై…శివారెడ్డిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం!

వాస్తవం ప్రతినిధి: ఐర్లాండ్ లో నివసిస్తున్న ఎన్నారై మేకల ప్రభోద్ రెడ్డి గారి సహాయంతో యాదాద్రి జిల్లా, పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శివారెడ్డిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిభిరం 6వ సంవత్సరం విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లు ఈ వైద్య శిభిరానికి విచ్చేసి తమ వంతు సహాయాన్ని అందించారు. ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన ఉచిత వైద్య శిభిరం లో సుమారు 400 నుండి 500 మంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు మెడికల్ క్యాంపు కి విచ్చేసి డాక్టర్స్ సేవలను వినియోగించుకున్నారు. ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించడం జరిగింది. మేకల జంగా రెడ్డి, పీసర్ల మహిపాల్ రెడ్డి మరియు చిలుముల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ వారు మాట్లాడుతూ.. శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎన్నారై మేకల ప్రభోద్ రెడ్డి తమ గ్రామంలో గత ఆరు సంవత్సరాలుగా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించటానికి కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. అలాగే సన్ రైజ్ హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్లు కూడా తమకు సహాయం అందిస్తున్నారని తెలిపారు.

“సంక్రాంతి సమయంలో నాట్లు వేసిన రైతులు కీళ్ల నొప్పులతో, చలి జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మొండి ధైర్యంతో కొందరు, ఆర్ధిక స్థోమత లేక మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్యం చేస్తున్నప్పుడు ఈ సమస్యకు ఒక పరిస్కారం చూపాలని మా గ్రామానికి ఏదైనా మంచి పని చేయాలనే తపనతో మా గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఐర్లాండ్లో నివాసం ఉంటున్న ప్రభోద్ రెడ్డి అన్నను సంప్రదించినప్పుడు, మాకు సహాయం చేస్తానని ముందుకువొచ్చి, ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఉచిత వైద్య సేవకు కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారని” తెలిపారు.

ఈ సందర్భంగా పోచంపల్లి మండల ఎంపీటీసీ అధ్యక్షులు మాడ్గుల ప్రభాకర్ రెడ్డి , జడ్పీటీసీ అధ్యక్షురాలు కోట పుష్పలత ,గ్రామ సర్పంచ్ పీసర్ల మంజుల మహిపాల్ రెడ్డి మరియు శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆర్ధిక సహాయం అందించిన మేకల ప్రభోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా మేకల ప్రబోధ్ రెడ్డి గారి తల్లిదండ్రులను మరియు సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లను శివారెడ్డిగూడెం వెల్ఫేర్ సొసైటీ వారు ఘనంగా సత్కరించారు.

మేకల జంగా రెడ్డి, పీసర్ల మహిపాల్ రెడ్డి, చిలుముల వెంకట్ రెడ్డి, పీసర్ల రామకృష్ణ రెడ్డి, పీసర్ల నర్సింహారెడ్డి, పీసర్ల రవీందర్ రెడ్డి, పీసర్ల రాజశేఖరరెడ్డి, పీసర్ల శ్రీకాంత్ రెడ్డి, వారల శ్రీనివాస్ రెడ్డి, మేకల అశోక్ రెడ్డి, అంతటి రమేష్, నారి రాజేందర్, బొక్క జంగా రెడ్డి, మూడుపూరు జంగా రెడ్డి, వారాల మల్లా రెడ్డి, వారాల జంగా రెడ్డి, వారల జగన్ మోహన్ రెడ్డి, వారల సుధాకర్ రెడ్డి, మొద్దు బస్వా రెడ్డి, చిలుముల శేఖర్ రెడ్డి, కందాడి విష్ణు, గూడూరు శ్రీను, ముప్పారం బ్రహ్మ చారీ, మోర ఇంద్ర సేన రెడ్డి, బొక్క వెంకట్ రెడ్డి, ఎరవోలు శ్రీను, ముద్దగోని సంతోష్ తదితరులు టీం సభ్యులు ఈ ఆరోగ్య శిభిర కార్యక్రమంలో పాల్గోని, ఎటువంటీ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేశారు.