చంద్రబాబు పై విజయసాయి రెడ్డి. కాంట్రవర్షియల్ కామెంట్స్.!!

వాస్తవం ప్రతినిధి: వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుపై కాంట్రవర్షియల్ కామెంట్స్  చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువుల్లా కొన్నాడు అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.

అయితే ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్టచెప్పి కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఎమ్మెల్సీలు తనను ఎక్కడ దిక్కరిస్తారో అని చంద్రబాబు అభద్రతా భావానికి గురై భయపడిపోతున్నారు…కనీసం బాబుకు నిద్ర కూడా పట్టడం లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.

అంతేకాకుండా ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసే అంతవరకు జీతభత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన మండలి సభ్యులు వైసీపీ పార్టీలో కి వెళ్లడానికి రెడీగా ఉన్నారని..కానీ వైయస్ జగన్ తనని చంద్రబాబులా తయారు చేయవద్దని శాసన మండలి రద్దు కే మొగ్గు చూపారు. ఇప్పటికే క్యాబినెట్ కూడా శాసన మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలపడంతో అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.