ఎన్నికల్లో కారు ప్రభంజనంపై యుకే ప్రవాసుల హర్షం!

వాస్తవం ప్రతినిధి : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు ప్రభంజనంపై ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తుంటే.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారైల సంక్షేమం కోసం త్వరలో తీసుకరాబోతున్న ‘ఎన్నారై పాలసీ’ పట్ల ప్రకటన చేయడం యావత్ ఎన్నారై సమాజం హర్షిస్తుందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ లో నివసిస్తున్న ఎన్నారై బిడ్డల పట్ల కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అలోచించి తానే స్వయంగా గల్ఫ్ దేశాలు పర్యటించి వారి సంక్షేమానికి కృషి చేస్తాననడం, ఎన్నారైల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలందరి పక్షాన ముఖ్యంగా గల్ఫ్ ఎన్నారైల పక్షాన ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలియజేసారు.