దేశానికి తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది: గవర్నర్ తమిళిసై

వాస్తవం ప్రతినిధి : తెలంగాణలోని హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్స్‌లో 71వ గణంతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు సీఎం కేసీఆర్‌, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. దేశానికి తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా, రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఆరేళ్లలో అభివృద్ధికి గట్టి పునాదులు పడ్డాయని అన్నారు. తక్కువ సమయంలోనే ఎంతో ప్రగతి సాధించారని, పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారయని తెలిపారు. అలాగే.. త్వరలోనే పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు మొదలుకానున్నాయని తెలిపారు తమిళిసై.