జాతీయ జెండాకు కేవలం సెల్యూట్ చేసినంత మాత్రాన సరిపోదు: పవన్‌ కల్యాణ్‌

వాస్తవం ప్రతినిధి : గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన,జాతీయ జెండాకు కేవలం సెల్యూట్ చేసినంత మాత్రాన సరిపోదని, పూర్వీకుల త్యాగాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, భవిష్యత్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హిందూయిజం మతం కాదని, భారతీయతని గుర్తుంచుకోవాలని కోరారు. ఇండియా నుంచి మత ప్రాతిపదికనే పాకిస్థాన్ విడిపోయిందని, పాక్ ముస్లిం దేశంగా మిగిలిపోగా, ఇండియా మాత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, సమాజానికి మేలు చేసే పనులు చేయాలని పవన్ వ్యాఖ్యానించారు.