అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి

వాస్తవం ప్రతినిధి: ఇండియా గేట్ సమీపంలోని జాతీయ వార్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులర్పించారు. అమర వీరుల స్మారక స్ఫూపం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సీడీఎస్ బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్ కేఎస్ బదూరియా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.