సింధుకి కష్టంగానే ఉన్నప్పటికీ తప్పదు: పుల్లెల గోపీచంద్‌

వాస్తవం ప్రతినిధి: వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్‌) నిర్దేశించిన షెడ్యూల్‌ కష్టంగానే ఉన్నప్పటికీ సింధు దానికి అలవాటు చేసుకోవాలి నేషనల్ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సూచించారు. వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానంతరం సింధు ఆట గాడితప్పిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో తెలుగు అమ్మాయి సతమతమవుతోంది. అయినా సింధుకు టోక్యోలో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇతర భారత టాప్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌ కూడా ‘టోక్యో’కు అర్హత సాధిస్తారన్నారు. ప్రస్తుతం జూనియర్‌ స్థాయిలోనూ భారత ప్లేయర్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న ఆయన భవిష్యత్‌లో భారత బ్యాడ్మింటన్‌ గొప్ప విజయాలు సాధిస్తుందని తెలిపారు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌’ పుస్తకాన్ని ఈ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ వ్యూహాలు, బీడబ్ల్యూ ఎప్ షెడ్యూల్‌పై మాట్లాడారు.