ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్‌

 వాస్తవం ప్రతినిధి: మున్సిపల్‌ మంత్రిగా ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని, ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు అంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతూ… క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లోనే ఉండి ఫలితాల సరళిని తెలుసుకుంటున్నారు. వెలువడుతున్న ఫలితాలతో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ విశ్లేషణ చేస్తున్నారు. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం లభించిందని కేటీఆర్ అన్నారు .