కలియుగ ప్రేమాయణం..మాటలు లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్..!!

వాస్తవం ప్రతినిధి : ప్రేమ అన్న మాటకే అర్దం మార్చెస్తున్నారు నేటి తరం కోందరు యువతి యువకులు. ప్రేమ పవిత్రమైంది. కొందరికి దాని గొప్పతనం తెలియక ప్రేమకుండే అర్థాన్నే మార్చేస్తున్నారు. చిన్న వయసులోనే ప్రేమ పేరుతో పాడు పనులు చేసి వారి బంగారు భవిష్యతుని నాశనం చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనం రష్యాలో జరిగిన ఓ సంఘటనే. రష్యాలో ఉంటున్న ఓ 10 ఏళ్ల బాలుడి కారణంగా 13 ఏళ్ల అమ్మాయి గర్భవతి అయింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్ గా మారడంతో రష్యాలోని ఓ మీడియా సంస్థ వారిద్దరిని ఇంటర్యూ చేసింది. ఈ ఇంటర్యూలో వీరిద్దరూ మైండ్ బ్లాక్ అయే సమాధానాలు ఇచ్చారు. వారు మొదటిసారిగా ఒకరినొకరు చూసుకుంది ఓ పంక్షన్‌లో అని, తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాం అని, పరిచయమైన రెండు రోజులకే డేటింగ్‌కు కూడా వెళ్లినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కటైయారని, కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్ని చెప్పారు. కాని, అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. గర్భానికి వేరెవరో కారణమైతే.. తమ కొడుకును ఇరికించేందుకు ఆ అమ్మాయి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఆ అబ్బాయి మాత్రం గర్భానికి కారణం తానే అని వాదించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..ఆ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు మాత్రం అతనికి ఇంకా పునరుత్పాదక సామర్థ్యం రాలేదని తేల్చి చేపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు ప్రారంభించారు.