ఆస్ట్రేలియా ఓపెన్ :ఒసాకాకు షాకిచ్చిన డిఫెండింగ్ చాంపియన్ నవోమి

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా ఓపెన్‌లో 15 ఏళ్ల అమెరికా సంచలనం కోరి గాఫ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత వీనస్‌ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే మట్టికరిపించిన ఈ అమెరికా టీనేజ్ గర్ల్.. తాజాగా డిఫెండింగ్ చాంపియన్ నవోమి ఒసాకాకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో గాఫ్ 6-3,6-4తో వరల్డ్ నెంబర్ 3 ఒసాకా(జపాన్) వరుస సెట్లలో విజయం సాధించి నాలుగో రౌండ్‌కు ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది యూఎస్ ఓపెన్ వేదికగా ఒసాకా ఎదురైన పరాభావానికి గాఫ్ ప్రతీకారం తీర్చుకుంది. గంటా 32 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ ఆద్యాంతం ఆకట్టుకుంది. హోరాహోరిగా సాగిన తొలి సెట్‌లో తొలి గేమ్‌ను గెలచుకొని ఆధిక్యంలో నిలిచిన గాఫ్.. అదే జోరును కొనసాగిస్తూ 6-3తో సెట్‌ను సొంతం చేసుకుంది. సెకండ్ సెట్‌లో ఓదశలో 2-1తో వెనుకంజలో నిలిచిన అమెరికా టీనేజ్ గర్ల్.. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి రేసులోకి దూసుకొచ్చింది. అనంతరం వరుస గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై గాఫ్ సంతోషం వ్యక్తం చేసింది.