డిస్కో రాజా రివ్యూ

రిలీజ్ డేట్: జనవరి 24, 2020

రేటింగ్ : 2.75/5 

నటీనటులు : రవితేజ, పాయల్ రాజ్ పుత్  , నభా నటేష్   

డైరెక్టర్: విఐ ఆనంద్

స్టోరీ:

సైన్స్ ల్యాబ్ లో ఒక ప్రయోగం చేస్తుండగా వాసుకి(రవితేజ) ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అవుతుంది. కానీ మళ్ళీ బతుకుతాడు. అయితే అతని బుర్రలో ఉన్న ఆలోచనలు గతానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ కోల్పోయి ఉంటాడు. దీంతో అతను ఎవరు..? అతని కుటుంబం గురించి గతం గురించి తెలుసుకోవడానికి ఒక ఎంపీ తో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ పరిణామం లోనే సేతు ( బాబీ సింహా ) గురించి కూడా తెలుసుకుంటాడు. ఇంతకీ సేతు కీ, వాసు కీ సంబంధం ఏంటి, ఇంతకీ వాసు మళ్లీ తన గతాన్ని గుర్తు తెచ్చుకోవడం జరిగిందా..? మరి మధ్యలో డిస్కో రాజా అనేది ఎవరు..? అనేది చాలా సస్పెన్స్ గా రకరకాల ట్విస్టులతో సినిమా స్టోరీ సాగుతోంది.

ప్లస్ పాయింట్స్:

సినిమా మొత్తానికి డిస్కో రాజా గా రవితేజ చేసిన క్యారెక్టర్ చాలా హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన ఫుల్ ఎనర్జిటిక్ నటనతో అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో స్క్రీన్ పై రెచ్చిపోయిన రవితేజ మళ్లీ ఈ సినిమాతో తన ఎనర్జీ అంటే ఏంటో నిరూపించాడు. ఇదే తరుణంలో చేతు పాత్ర చేసిన బాబీ సింహా నటన కూడా చాలా బాగుంటుంది. సినిమాకి ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ప్రేక్షకులను రక్తికట్టించింది. ఇంటర్వెల్ తర్వాత 30 నిమిషాలు అమాంతం స్టొరీ ని ఓ రేంజ్ లో నడిపించాడు. అలాగే తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకి హైలెట్ అని చెప్పాలి. సాంగ్స్ దియేటర్ లో చాలా అద్భుతంగా వచ్చాయి. సినిమా మొత్తానికి బాబి సింహాన్ని హీరో కన్ఫ్యూజన్ లో ఇరకాటంలో పెట్టే ఎపిసోడ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి.

మైనస్ పాయింట్స్:

సినిమా స్టోరీ చాలా రోటీన్ గానే ఉండటమే అతి పెద్ద మైనస్. ఇటువంటి రొటీన్ స్టొరీ ని కొన్ని సన్నివేశాల్లో తప్ప మిగతా చోట్ల చాలా బోరింగ్ గా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా సెకండాఫ్ చాలా వీక్ గా సినిమా చూస్తున్నంతసేపు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఈ సినిమాలో వచ్చిన కామెడీ పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. బోరింగ్ కామెడీ తో పాటు అసలు విలనిజం అనేది కనిపించదు. కాన్సెప్ట్ మంచిది తీసుకున్నా గాని డైరెక్టర్ విఐ ఆనంద్ స్టోరీని నడిపించడంలో విఫలమయ్యాడు.

టెక్నికల్ గా:

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. 100% తమన్ ఈ సినిమాకి న్యాయం చేశాడు. కెమెరా పనితనం పెద్దగా ఏమీ లేదు. ఎడిటింగ్ విషయంలో కాస్త సినిమా యూనిట్ జాగ్రత్త తీసుకొని ఉంటె కొంచెం బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రిజల్ట్:

సంక్రాంతి సీజన్ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలు సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇటువంటి తరుణంలో విడుదలైన ‘డిస్కో రాజా’ సినిమా భారీ లెవల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంటే గానీ బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి విపరీతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేక రెగ్యులర్ రివెంజ్ డ్రామాని తలపించింది. అయితే ఇటువంటి సినిమాకి ల్యాబ్ ఎక్స్పరిమెంట్ అంటూ సరికొత్త కోటింగ్ స్టోరీకి వేసిన డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులను అలరించ లేకపోయాడు. ఇక సినిమాని రవితేజ ఎనర్జీ నటన మాత్రమే కాపాడాలి.
                                                            ….పాంచజన్య