TDP లో అంతర్మధనం మొదలయ్యిందా..??

వాస్తవం ప్రతినిధి: గోటి తో పోయేదానికి గొడ్డలి దాక తెచ్చావు బాబూ అంటూ బాధపడుతున్న టీడీపీ ఎమ్మెల్సీ లు.శాసన సభలో ఆమోదించిన 3 రాజధానుల బిల్లును శాసన మండలి లో నిబంధనలకు విరుద్దంగా మండలి చైర్మన్ ద్వారా సెలెక్ట్ కమిటీ కి పంపి మహా అయితే 3 నెలలు ఆపగలం కానీ తరువాత అసెంబ్లీ చెప్పిందే వేదం అని తెలిసీ చేయడం వలన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంమీద చూసుకుంటే భవిష్యత్తులో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేకుండా మనంతట మనమే పార్టీ కింద గొయ్యి తవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంతర్మదనం పడుతున్నట్లు వినికిడి. శాసనమండలిలో వ్యవహరించిన తీరు మొత్తం బట్టి చూస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కేవలం అమరావతి రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యేలా జగన్ రాజకీయంగా చంద్రబాబును ఇరుకున పెట్టేశాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.