అసలు ఏ అధికారంతో జగన్ అసెంబ్లీలో మాట్లాడారు? అంటున్న మాజీ మంత్రి యనమల..!!

వాస్తవం ప్రతినిధి: మాజీ తెలుగుదేశం పార్టీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఏ అధికారంతో వైయస్ జగన్ మంత్రి మండలి గురించి మాట్లాడటం జరిగిందని యనమల ప్రశ్నించారు. అసెంబ్లీ మరియు మండలి రెండు వేరు వేరు వ్యవస్థలు అని, ఎవరి అధికారం వారికి ఉంటుందని ఎవరి రూల్ బుక్స్ వారికి ఉంటాయి అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లు మండలికి వస్తుంది అంటూ యనమల కామెంట్ చేశారు. వాటికి ఆమోదం తెలపడం… తిరస్కరించడం.. సవరణలు ప్రతిపాదించడం.. సెలెక్ట్‌ కమిటీకి పంపడం మండలికి ఉన్న హక్కు. ఇన్ని చెబుతున్నారు.. అసెంబ్లీలో ఏ నిబంధనలు పాటిస్తున్నారు? రాజధాని బిల్లులపై ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. 11 గంటలకు అసెంబ్లీలో చర్చకు పెట్టారు. సాయంత్రానికి ఆమోదించారు. అదే రోజు మండలికి పంపేశారు. బిల్లులను ప్రవేశపెట్టాక కనీసం రెండు రోజులు వ్యవధి ఇవ్వాలి. ఇచ్చారా? అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను బయటకు తరిమారు. ముఖ్యమంత్రి వచ్చి సైగ చేయగానే స్పీకర్‌ మార్షల్స్‌ను పిలిచారు. ఏ తీర్మానం చేయకుండానే స్పీకర్‌ చెప్పారని సభ్యులను తీసుకెళ్లి బయటపడేశారని అసలు మీరు అసెంబ్లీలో రూల్స్ పాటిస్తున్నారా అంటూ జగన్ పై మండిపడ్డారు మంత్రి యనమల.