జగన్ శాసన మండలి ని రద్దు చేస్తే మన పరిస్థితి ఏమిటి ?

వాస్తవం ప్రతినిధి: శాసన మండలి రద్దు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను కన్ఫ్యూజన్లో పెట్టేశారు జగన్. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడన్ గా ఎన్టీఆర్ శాసన మండలి ని రద్దు చేసినట్టుగా చేయకుండా సోమవారం దాక గడువు ఇవ్వడం ద్వారా జగన్ అటు ఉత్తరాంధ్ర వైపు మరియు ఇటు రాయలసీమ వైపు టీడీపీ శ్రేణులను దోషులుగా నిలబెట్టినట్టు అయిందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు.

ఈ పరిణామంతో టీడీపీ ఎమ్మెల్సీలు అమరావతి రాజధాని అని మంకు పట్టు పట్టి అటు ప్రజల ఆగ్రహం, ఇటు MLC పదవి కోల్పోవడం అవసరమా అని మల్లగుల్లాలు పడుతున్నారట. ప్రస్తుతం వికేంద్రీకరణకు రాష్ట్రవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఆ నిర్ణయంతోనే ఏకీభవించి వైసిపి పార్టీతో కలవడానికి తాజాగా కొంత మంది టిడిపి MLC లు జగన్ తో సంధి చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో రెండు రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఉంటాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.