నేను కొడితే మళ్ళీ లెగలేవు..పిల్లకాకి.:జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వైసీపీ, టిడిపీ నాయకుల మాటల తూటాలతో వాడిగా వేడిగా సాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాజీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొన్ని సంచలన రేపే కామెంట్స్ చేసారు.

“వెల్లంపల్లి శ్రీనివాస్ నేను ముష్టి వేస్తే గెలిచిన ఎమ్మెల్యే ..నా వయసు 68 సంవత్సరాలు 27 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఎంతో మందిని చూసా.. వాడికి తెలీదేమో దేవాదాయ శాఖలో చేసిన మంత్రికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని” అంటూ రెచ్చిపోయారు.

అంతే కాకుండా నువ్వు కుర్రాడివి నా కంటే చిన్నోడివి నువ్వే చెప్పు ఎక్కడికైనా వస్తా ఇద్దరం సింగిల్ గా కొట్టుకుందాం రా..అంటూ ఛాలెంజ్ చేస్తూ నేను కొడితే మళ్ళీ లెగలేవు నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా నువ్ లేగలేవు అంటూ నీ స్థాయిని మించిన మాట్లాడకు అంటూ హెచ్చరించారు.