జైలునుంచి బయటకు రాగానే వెంటనే అరెస్ట్ అయిన హార్దిక్‌ పటేల్‌

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ నాయకుడు, పాటేదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ను పోలీసులు మరొకసారి అరెస్టు చేశారు. దేశద్రోహం కేసులో అరెస్టయి సబర్మతి సెంట్రల్‌ జైలులో ఉన్న హార్దిక్‌ పటేల్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. జైలునుంచి బైటికి రాగానే గాంధీనగర్‌ జిల్లా పోలీసులు ఆయనను మరొకసారి అరెస్టు చేశారు. 2017లో పోలీసుల అనుమతి లేకుండా ఒక బహిరంగ సభలో మాట్లాడిన కేసులో హార్దిక్‌ పటేల్‌ను వారు అరెస్టు చేశారు.