ఆకులతో ఈలలు వేస్తూ సందడి చేసిన ధోని, జార్ఖండ్ సీ ఎం సోరెన్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లు జార్కండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పలు కొత్త సౌకర్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధోని, సోరెన్ ఉల్లిపాయ ఆకులను ఉపయోగించి ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్‌లో సౌర విద్యుత్ వ్యవస్థ, అత్యాధునిక జిమ్, సి3 ఫిట్‌నెస్ క్లబ్, ది అప్‌టౌన్ కేఫ్‌ను ధోని, హేమంత్ సోరెన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కొన్ని వంటలను రుచి చూడటంతో పాటు కొత్త రెస్టారెంట్‌లో కాఫీ కూడా తాగారు.