ఆడ-మగ అన్నింటిలో సమానం అంటుంటారు.. ఓరి దేవుడో..ఆకరికి ఇందులో కూడానా..??

వాస్తవం ప్రతినిధి : పురుషులకు ఏ మాత్రం మేము తీసిపోము అని ప్రతి రంగంలో మగవాళ్ళతో సమానంగా దూసుకుపోతున్నారు నేటి తరం మహిళలు. కాని కొందరు మహిళలు పోరుగు దేశలకు వెళ్ళి మన దేశ కీర్తిప్రతిష్టలు పెంచుతుంటే మరికొందరు మన దేశ పరువు తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో భర్తలను చంపే భార్యలు ఎక్కువ అయిపోయారు. ఆలా చేసేవారిలో ఈవిడ ఒకరు. పంజాబ్ రాష్ట్రం షాహీద్ భగత్ సింగ్ నగర్‌లోని ఖాట్కర్ కలాన్ గ్రామానికి చెందిన బల్బీర్ సింగ్ 23 ఏళ్లుగా భార్య అమర్జీత్ కౌర్, కూతురు అమన్దీప్ కౌర్‌లతో కలిసి లేబనాన్‌లోనే ఉండేవారు. ఇటీవల కుటుంబంతో స్వదేశానికి తిరిగి వచ్చిన ఎన్నారై దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలిసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారించగా..భార్య అమర్జీత్‌ తమ ఇంట్లో దొంగలు పడి రెండు గోల్డ్ బిస్కెట్లు, రూ.45 వేలు దోచుకెళ్లారని, తన భర్తను కూడా చంపేశారని పోలీసులకు చెప్పింది. అయితే, భార్య ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చి, ఆమె ను, ఆమెతో పాటు కూతురు అమన్దీప్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట దొంగలు పడి ఈ దారుణానికి పాల్పడ్డారని బుకాయించిన అమర్జీత్ ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం చెప్పింది. అమర్జీత్ చెప్పిన మాటలు విన్ని పోలిసులు ఖంగుతిన్నారు. ఆస్తి కోసం తనకు తెలిసిన మరో నలుగురితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది భార్య. తండ్రిని చంపడానికి సహకరించింది కూతురు. మిగత నలుగురు నిందితులను కూడా పట్టుకున్ని అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.