వారెవ్వా!..అదరహో అనిపించేలా..కెనడాలో ‘తాకా’ సంక్రాంతి వేడుకలు!

వాస్తవం ప్రతినిధి : “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను ఇతర దేశాల్లలో వున్న తెలుగు వారందరు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా సంక్రాంతి పండుగ ను ఘనంగా జరుపుకుంటారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా.. మన సంప్రదాయాలను మరచిపోరని ప్రతి యేటా నిరూపిస్తూనే ఉన్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. సంప్రదాయానికి వారు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది వారు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లోనే తెలిసిపోతుంది. సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్థామా..? వద్దా..? పండుగ కొసం అంతదూరం వెళ్లలా అని ఆలోచించేవాళ్లు చాలా మందే ఉంటారు అనడంలో సందేహం లేదు. కాని దేశవిదేశల్లలో ఉన్న మన తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో జనవరి 18న కెనడాలోని ఎటోబీకోక్‌లో గల మైఖేల్ పవర్ స్కూల్‌లో తెలుగు వారు సంక్రాంతి సంబరాలను అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఎటోబీకోక్‌లోని మైకేల్ పవర్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ సంబరాలకు రంజిత కాపర్తి, వాణి జయంతి, శైలజ కుందూరి దీప ప్రజ్వలన చేయగా, చిన్నారులకు వాణి జయంతి, కల్పన మోటూరిలు భోగిపళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వాన ఉపన్యాసం తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న పిల్లలకి ముగ్గుల పోటీలు, చిత్ర లేఖనం, సంగీతం వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమాల అనంతరం టాకా అధ్యక్షులు శ్రీనాద్ కుందూరి మాట్లాడుతూ…సంక్రాంతి విశిష్టత గూర్చి తెలియచెప్పారు. పూర్వ అధ్యక్షులు అరుణ్ లయం ఆధ్వర్యంలో కళానృత్యాలు, సినిమా పాటలు, డాన్సులు, ఫాషన్ షో వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయక సంక్రాంతి వంటలైన..అరిసెలు, పులిహోర, గారెలు కూడిన తెలుగు వంటకాల విందు భోజనం అందరిని అలరించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి తాకా అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.