పొరుగు దేశాల్లలో ప్రాణాలకు రక్షణ లేదా?..మిస్టరీగా మారిన భారత యువకుడి హత్య..!

వాస్తవం ప్రతినిధి : ఎన్నో ఆశలతో, ఎంతో సాధించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇండియా నుండి ఎంతో మంది పొరుగు దేశాలకు వెళ్తున్నారు. వీరిలో కొంత మంది అక్కడే వివిధ కారణాల చేత ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హాంలో శనివారం రాత్రి ఓ పబ్ వద్ద జరిగిన గొడవలో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాటింగ్‌హాంషైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాటింగ్‌హాం ట్రెంట్ యూనివర్సిటీలో చదువుతున్న అర్జున్ సింగ్‌పై శనివారం రాత్రి స్లగ్ అండ్ లెట్టూస్ అనే పబ్ సమీపంలో జరిగిన ఘర్షణలో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్జున్ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నాటింగ్‌హాంషైర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఈ ఘటనకు సంబంధించి ఓ 20 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణకు సంబంధించి తమ డిటెక్టివ్‌ల బృందం నిర్విరామంగా పనిచేస్తుందన్ని, ఈ మర్డర్ మిస్టరీని త్వరలోనే చేధిస్తామని నాటింగ్‌హామ్‌షైర్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ రిచర్డ్ మాంక్.