బాలకృష్ణ సినిమా ఎఫెక్ట్ తో సినిమా ఆపేసిన నాగార్జున..!!

వాస్తవం సినిమా: నందమూరి బాలకృష్ణ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని ఎన్టీఆర్ బయోపిక్ గా రెండు భాగాలుగా తెరకెక్కించి పరాజయం చూడటం జరిగింది. దీంతో అక్కినేని నాగేశ్వర రావు జీవిత చరిత్ర తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్న నాగార్జున బాలకృష్ణ సినిమా ఎఫెక్ట్ తో ఆ ప్రయత్నాలు ఆపేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా వార్తలు వినబడుతున్నాయి. ముందుగా ఏ ఎన్ ఆర్ బయోపిక్ తీయాలని ఆలోచన ఉన్న నాగార్జున …మహానటుడు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి వచ్చిన రెండు బయోపిక్ రిజల్ట్ చూసి అటువంటి ప్రయోగాలకు వెళ్లకూడదని తండ్రి నాగేశ్వరరావు గారికి ఉన్న పేరు ఆ విధంగానే కొనసాగాలని బయో పిక్ తీసి అనవసరంగా లేనిపోని ప్రయత్నాలు చేసి ఏఎన్ఆర్ పేరుకు మచ్చ లేకుండా ఉండాలని అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ సినిమా కి సంబంధించి ప్రయత్నాలు నాగార్జున విరమించుకున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.