200 కోట్ల క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు..!!

వాస్తవం సినిమా: అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా పాటలకు అదిరిపోయే స్టెప్పులు తో అభిమానులను అలరించిన మహేష్ బాబు..సరికొత్త మాస్ పెర్ఫార్మెన్స్ తో డైలాగ్ డెలివరీ పక్కా మాస్ తరహాలో స్క్రీన్ పై సరికొత్తగా తనని తాను మహేష్ ఆవిష్కరించడంలో సక్సెస్ కావడంతో సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. దీంతో కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్లు గ్రాస్ వసూలు కలెక్ట్ చేసినట్లు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పది రోజులలో 101.87 కోట్లు షేర్ రాబట్టినట్టు సమాచారం. అయితే నైజాంలో 88 కోట్లు, సీడెడ్‌లో 14.65 కోట్లు, గుంటూర్‌లో 98.08 కోట్లు, తూర్పు గోదావరిలో 10.06 కోట్లు, పశ్చిమ గోదావరిలో 6.57 కోట్లు, కృష్ణలో 7.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 17.07 కోట్లు, నెల్లూర్‌లో 8.62 కోట్లు సాధించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా రెండు సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేసిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి అదే రచ్చ కొనసాగిస్తున్నారు.