మరొక సినిమా లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్..??

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ ‘పింక్’ సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవటం తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు కావడంతో వచ్చే సమ్మర్ కే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పింక్’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి వారం రోజులు గడవక ముందే పవన్ కళ్యాణ్ మరొక సినిమా లైన్ లో పెట్టినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరొక సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఈనెల 27వ తారీకు నుండి స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో చాలా బలంగా వినబడుతున్నాయి. మరి వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.