‘డిస్కో రాజా’ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న రవితేజ..??

వాస్తవం సినిమా: మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన రవితేజ ముందుగా డిస్కో రాజా సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రవితేజ సినిమా కన్ఫామ్ గా హిట్ అవుతుంది అన్న తరహాలో మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముఖ్యంగా సినిమాలో కామెడీకి పెద్దపీట వేసినట్లు విలన్ మరియు రవితేజ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అన్నట్టు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. మొన్నటివరకు ఎనర్జీ సబ్జెక్టులతో సినిమాలు చేసిన రవితేజ డిస్కో రాజా సినిమాలో తన ఎంటర్టైనర్ యాంగిల్ ని సరికొత్త రూపంలో చూపించారట. కాగా ఈ సినిమాలో కోమాలోకి వెళ్లిన రవితేజ బయటకు వచ్చిన తర్వాత కొత్త క్యారెక్టర్ తో స్క్రీన్ పై కనిపించనున్నట్లు కామెడీ అదిరిపోయే రీతిలో సినిమా చేసినట్లు సమాచారం. మొత్తం మీద వరుస ప్లాపులతో ఉన్న రవితేజ డిస్కో రాజా సినిమా రిజల్ట్ పై మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.