మొదలైన తెలంగాణ స్థానిక ఎన్నికల పోలింగ్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. దాదాపు తొమ్మిది కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ 961 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ వివరించడం జరిగింది. దాదాపు ఈ ఎన్నికల్లో 50 వేల మంది పోలీసులు బందోబస్తు చేస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నారు. జరగబోతున్న ఈ స్థానిక ఎన్నికల కోసం 120 మునిసిపాలిటీ స్థానాలకు గాను 11,099 మందిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 9 కార్పొరేషన్ స్థానాలకు గానూ 1746 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక డివిజన్ మరియు మునిసిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు సిద్ధంగా వున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఓటు వేస్తూ సెల్ఫీలు వంటివి దిగితే చట్టపరంగా శిక్ష పడే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. దీంతో ఇప్పటికే చాలా చోట్ల తెలంగా ణలో అత్యధిక శాతం పోలింగ్ శాతం నమోదు కావటం హర్షణీయమని పలు పార్టీల రాజకీయ నేతలు అంటున్నారు.