టిడిపి ఎమ్మెల్యేలను వీధి రౌడీలతో పోల్చిన జగన్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు పోడియం వద్ద స్పీకర్ చుట్టూ నిలుచుని జై అమరావతి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణం సృష్టించడంతో సభలో పరిస్థితులు గందరగోళంగా మారడంతో సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేల పై ఫైర్ అయ్యారు. సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, మెజార్టీ కలిగిన వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు ఓపికగా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదని రెచ్చగొట్టే విధంగా టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మంచి జరుగుతుంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు చేతనైతే సలహాలు ఇవ్వాలి… చేతకాకపోతే సభ బయట ఉండాలని సూచించారు సీఎం జగన్. స్పీకర్ పోడియం దగ్గర రింగ్‌ దాటితే మార్షల్స్‌ను పెట్టి సభ్యులను బయటకు పంపాలన్న ఆయన.. స్పీకర్ పోడియం దగ్గర సభ్యులు వస్తే వెంటనే మార్షల్స్‌ను పిలిచి వారిని అడ్డుకోవాలన్నారు. టీడీపీ సభ్యులు 10 మంది ఉన్నారు.. వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ సీఎం జగన్… వీధి రౌడీలను ఏరివేయకపోతే వ్యవస్థ మారదంటూ సీరియస్ కామెంట్లు చేశారు.