ఇది కూలిపోయే ప్రభుత్వం అంటున్న పవన్ కళ్యాణ్..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అమరావతి ప్రాంతంలో ధర్నాలు నిరసనలు చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో చాలా మంది మహిళలు అలాగే రైతులు గాయాల పాలు కావడంతో గాయాలైన రైతులంతా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవు అని, ఇది కూలిపోయే ప్రభుత్వమని అవసరమైతే కూల్చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అని చూడకుండా పోలీసులు లాఠీఛార్జి చేయడం అమానుషమని వైసీపీ నేతలు తలకెక్కి పరిపాలిస్తున్నారు అని ఈ విషయంపై ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అద్భుతాలు జరగడం ఖాయమని ఏపీ ప్రభుత్వం పై వైఎస్ జగన్ పరిపాలన పై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.