కోహ్లీ కెప్టెన్స్‌పై పరోక్షంగా..

 వాస్తవం ప్రతినిధి: జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనికి ఉన్న స్పష్టత మరెవరికీ ఉండేది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసన్నాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ధోని కెప్టెన్సీకి ప్రస్తుతానికి ఉన్న తేడాను ఈ డాషింగ్ ఓపెనర్ విశ్లేషించాడు. టీ20ల్లో ఐదోస్థానంలో కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగి విఫలమైమతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలవదని, కానీ ధోని హయాంలో అలా ఉండేది కాదని పరోక్షంగా కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలను చెప్పుకొచ్చాడు.

‘ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఓ నాలుగుసార్లు విఫలమైతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే అతని బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తుంది. కానీ ధోని మాత్రం ఇలా చేసేవాడు కాదు. అలాంటి స్థితిలో ఆటగాళ్లకు మద్దతివ్వడం ఎంతో ముఖ్యమో అతనికి బాగాతెలుసు. అందుకే వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించేవాడు’అని ఈ డాషింగ్ ఓపెనర్ తెలిపాడు.