న్యూజిలాండ్‌ పర్యటన ముందు టీమిండియాకి భారీ షాక్

వాస్తవం ప్రతినిధి: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటన ముందు టీమిండియాకి భారీ షాక్ తగిలింది. భుజ గాయం కారణంగా భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ధావన్ స్థానంలో బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి ధావన్ దూరమవడంతో.. అతని స్థానంలో సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారో అని చర్చ మొదలైంది. గత ఏడాది గాయాలతో సతమతమైన శిఖర్‌ ధావన్‌.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డాడు.